అయ్యప్ప దేవాయ నమ:

Ayyappa Devaya Namaha

అయ్యప్ప దేవాయ నమఃఅభయ స్వరూపాయ నమఃఅయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమఃహరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమఃనిజ భీర గంభీర శభరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమఃపరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయ నమఃఅయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కీ గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామిఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి జనకృందముల చేరే జగమేలు స్వామితన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి స్వామియే శరణం అయ్యప్పస్వాములందరు తనకు సాయమ్ము కాగా ధీమంతుడై లేచి ఆ కన్నె స్వామిపట్టబందము వీడి భక్తతటికై పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడైఅయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
ఘోర కీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరిషాపాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానది తీరా ఎరుమేలి వాసానియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించు కనిపించు అయ్యప్ప స్వామిమకర సంక్రాంతి సజ్యోతిపై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామికర్మ బందము బాపు ధర్మ శాస్త్ర కలి భీతి తొలగించు భూతాధినేతఅయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము అజ్ఞాన తిమిరమ్ము నణుచు శుభదీపంఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు పడిమెట్లుగా మారె ఇదో అపురూపంఅమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పంపదములకు మ్రొక్కగా ఒక్కోక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకంపంపానది తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి భక్తులను రక్షించు స్వామిశరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్పశరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్పస్వామియే శరణమయ్యప్పస్వామియే శరణమయ్యప్పఓం శాంతి శాంతి శాంతిఃఓం శాంతి శాంతి శాంతిః